సీఎం కేసీఆర్‌కు కంచి కామకోటి పీఠం ఆహ్వానం

92
cm kcr
- Advertisement -

కంచి కామకోటి పీఠం (ధర్మాధికారి ) శ్రీకార్యం బ్రహ్మ శ్రీ చల్లా విశ్వనాథ శాస్త్రి, పీఠం ఆస్థాన పండితులు బ్రహ్మశ్రీ చింతపల్లి సుబ్రమణ్య శాస్త్రి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావును ప్రగతిభవన్లో వారి నివాసంలో కలిశారు. కంచి కామకోటి పీఠం లో జరుగుతున్న శ్రీవిద్యా యాగం లో పాల్గొనాల్సిందిగా వారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆహ్వానించారు.

అదేవిధంగా కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్న సంప్రదాయ పాఠశాల ఇతర కార్యకలాపాల కోసం హైదరాబాదులో స్థలం కోసం వారు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి వారికి అనువైన చోట పీఠానికి స్థలం ఇవ్వడానికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అదేవిధంగా కంచి కామకోటి పీఠం కార్యకలాపాల గురించి ముఖ్యమంత్రి కంచికామకోటి పీఠం శ్రీకార్యం చల్లావిశ్వనాధ శాస్త్రి ద్వారా దాదాపు గంటసేపు చర్చించి అన్ని విషయాలు తెలుసుకున్నారు.

- Advertisement -