- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 3805 కరోనా కేసులు నమోదుకాగా 13 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,45,91,112కు చేరగా 4,40,24,164 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు.
ప్రస్తుతం దేశంలో 38,293 కేసులు యాక్టివ్గా ఉండగా ఇప్పటివరకు 5,28,655 మంది మరణించారు. రోజువారీ పాజిటివిటీ రేటు 1.29 శాతానికి చేరగా మొత్తం కేసుల్లో 0.09 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 218.68 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వైద్యశాఖ వెల్లడించింది.
- Advertisement -