దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..

83
india covid

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 37,593 కొత్త కేసులు నమోదుకాగా 648 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,25,12,366కు చేరగా 3,17,54,281 మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3,22,327 యాక్టివ్‌ కేసులున్నాయి.

కరోనాతో ఇప్పటివరకు 4,35,758 మంది మృతిచెందగా రికవరీ రేటు 97.67శాతానికి పెరిగింది. ఇప్పటివరకు 59.55కోట్ల టీకాలు వేయగా 51,11,84,547 నమూనాలను పరిశీలించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.