తెలంగాణలో కరోనా అప్‌డేట్‌..

36

తెలంగాణలో అతి తక్కువ కరోనా కేసులు నమోదౌతున్నాయి.. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 88,347 కరోనా పరీక్షలు నిర్వహించగా, 389 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 70 కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 36, నల్గొండ జిల్లాలో 28, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 కేసులు వెల్లడయ్యాయి. నిర్మల్ జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 420 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,55,732 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,45,594 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,276 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,862కి చేరింది. కరోనా మరణాల రేటు జాతీయస్థాయిలో 1.3 శాతం ఉండగా, తెలంగాణలో 0.58 శాతానికి దిగొచ్చింది.