ఒకే ఓవర్‌లో 37 పరుగులు..!

239
37 runs in an over by Duminy
- Advertisement -

ఒకే ఓవర్‌లో 36 పరుగులు చేస్తే అదో రికార్డు. ఎందుకంటే ఎదో కొన్ని సందర్భాల్లో మాత్రమే సాధ్యపడుతుంది. అలాంటిది ఒకే ఓవర్లో 37 పరుగులు చేస్తే..అవును మీరు చదువుతుంది నిజమే. దక్షిణాఫ్రికా డాషింగ్ బ్యాట్స్‌ మెన్ డుమిని సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఒకే ఓవర్‌లో 37(6,6,6,6,2,5nb,6) పరుగులు చేసి దక్షిణాఫ్రికా లిస్ట్-ఎ రికార్డులను
తిరగరాశాడు.

37 runs in an over by Duminy

నైట్స్‌తో జరిగిన మూమెంట్ కప్ వన్డే మ్యాచ్‌లో డుమిని ఈ ఘనత సాధించాడు. లెగ్ స్పిన్నర్ ఎడ్డీ లీయి బౌలింగ్‌ను జేపీ చీల్చి చెండాడాడు. నాలుగు బంతుల్ని వరుసగా సిక్సర్లు బాదిన డుమిని మరుసటి బంతికి రెండు పరుగులు తీశాడు. అది కాస్తా నోబాల్‌గా అయ్యింది. దీంతో ఎడ్డీ విసిరిన అదనపు బంతిని ఫోర్‌గా బాదిన డుమిని ఆఖరి బంతిని సిక్సర్‌గా మలిచాడు. దీంతో ఒకే ఓవర్లో 37 పరుగులు వచ్చాయి. ఈ మ్యాచ్‌లో డుమిని 37 బంతుల్లోనే 70 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

డుమిని విధ్వంసకరమైన బ్యాటింగ్ కారణంగా కేప్ కోబ్రాస్ 240 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేధించింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు రాబట్టిన రికార్డ్ జింబాబ్వే ఆటగాడు చిగుంబుర పేరిట ఉంది. 2013లో ఢాకా ప్రీమియర్ లీగ్‌లో బంగ్లా బౌలర్ అల్లావుద్దీన్ బాబు బౌలింగ్‌లో చిగుంబుర 39 పరుగులు రాబట్టాడు.

- Advertisement -