చెన్నైకి ఢిల్లీ షాక్..

260
CHENNAI MARCH TO TOP HALTED BY DELHI DAREDEVILS
- Advertisement -

ప్లే ఆఫ్ రేసుకు దూరమైన ఢిల్లీకి ఓదార్పు విజయం లభించింది. సొంతగడ్డపై ధోని సారధ్యంలోని చెన్నైను ఓడించి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. 163 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఆరంభం కలిసిరాలేదు. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చెన్నైకి పరుగులు రావడం కష్టంగా మారింది. తొలి 5 ఓవర్లలో కేవలం 23 పరుగులు మాత్రమే చేసింది. పవర్ ప్లే చివరి ఓవర్‌లో అంబటి రాయుడు మూడు సిక్సర్లు,ఫోర్‌తో రాణించడంతో చెన్నై గాడిలో పడినట్లే కనిపించింది.

ఈ దశలో వాట్సన్ వెనుదిరగడంతో చెన్నై కష్టాల్లో పడింది. ఓ దశలో మరో ఓపెనర్ అంబటి రాయుడు (50: 29 బంతుల్లో 4×4, 4×6) రాణించిన అతనికి సహకారం అందించే వారు కరువయ్యారు. రవీంద్ర జడేజా (27 నాటౌట్: 18 బంతుల్లో 2×6) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. ధోని (17: 23 బంతుల్లో 1×4), సురేశ్ రైనా (15: 18 బంతుల్లో 1×4) మిడిల్ ఓవర్లలో ఆశించినంత వేగంగా ఆడలేకపోవడంతో ఆఖర్లో బంతులు, పరుగుల మధ్య అంతరం భారీగా పెరిగిపోయి చెన్నై ఓటమి ఖాయమైంది. బౌల్ట్‌ (2/20) అమిత్‌ మిశ్ర (2/20), సందీప్‌ లమిచానె (1/21), హర్షల్‌ (1/23) ధాటికి ఛేదనలో చెన్నై 6 వికెట్లకు 128 పరుగులే చేయగలిగింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. అంతకముందు ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా (17: 17 బంతుల్లో 1×4, 1×6) ఆరంభంలోనే ఔటవగా.. అనంతరం వచ్చిన రిషబ్ పంత్ (38: 26 బంతుల్లో 3×4, 2×6)తో కలిసి కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (19: 20 బంతుల్లో 3×4) రాణించారు. చివర్లో హర్షల్ పటేల్ (36 నాటౌట్: 16 బంతుల్లో 1×4, 4×6), విజయ్ శంకర్ (36 నాటౌట్: 28 బంతుల్లో 2×4, 2×6) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.

- Advertisement -