35 చిన్న కథ కాదు..రిలీజ్ డేట్ ఛేంజ్

6
- Advertisement -

నివేత థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్.”35-చిన్న కథ కాదు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

తొలుత ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ఛేంజ్ అయింది. ఆగస్టు 15న బాక్సాఫీస్ దగ్గర పలు సినిమాలు క్లాష్ అవుతుండటంతో సినిమా రిలీజ్ డేట్‌ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియో రిలీజ్ చేయగా టీచర్ చెప్తే వినాలి.. రిలీజ్ తేది మారాలి అని చెప్పుకొచ్చాడు.

టీచర్స్ డే రోజైన సెప్టెంబర్ 5న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రిలీజ్ అయినట్లు తెలుస్తోంది. విశ్వ, ప్రియదర్శి, గౌతమి కీలకపాత్రల్లో నటిస్తుండగా వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.

Also Read:NBK 109..కీ అప్‌డేట్

- Advertisement -