దేశంలో 24 గంటల్లో 3,43,144 కరోనా కేసులు

70
covid

దేశంలో కరోనా మహమ్మారి తీవ్రరూపం దాలుస్తోంది. గత 24 గంటల్లో 3,43,144 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 4 వేల మంది ప్రాణాలు కొల్పోయారు. దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,40,46,809కు చేరగా 37,04,893 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 2,00,79,599 బాధితులు కోలుకోగా 17,92,98,584 ఇప్పటి వరకు డోసులు పంపిణీ చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఇక దేశంలో ఇప్పటి వరకు 31.13 కోట్ల టెస్టులు చేసినట్లు వైద్యశాఖ తెలిపింది.