తప్పులు తెలుసుకున్నా..అంతా నా మంచికే:అభిరామ్

72
abhiram

తప్పులు అందరూ చేస్తాను..నేను చేసిన తప్పులు బయటికొచ్చాయని..వాటి నుండి చాలా తెలుసుకున్నానని వెల్లడించారు నిర్మాత సురేశ్‌ బాబు కుమారుడు అభిరామ్. నేను చేసిన తప్పులేంటో తెలుసుకున్నా. ఆ అనుభవంతో నాలో మార్పు వచ్చింది. వాటి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ఆ సమయంలో కుటుంబమే అండగా నిలిచింది. ఇప్పుడు ఏ పనులు చేయాలి? ఏది చేయకూడదు? అనే విషయాలు బాగా తెలిశాయి. అంత నా మంచికే అనుకుంటున్నా అని వెల్లడించారు.

ఓ యూ ట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన అభిరామ్… తేజ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 1.1తో హీరోగా పరిచయం కానున్నారు. కొవిడ్‌ తీవ్రత తగ్గాక షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు అభిరామ్.