హైదరాబాద్ ఓఆర్ఆర్ను 30 ఏళ్ల లీజుకు దక్కించుకుంది ముంబైకి చెందిన ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్.ఈ సంస్థ 30ఏళ్ల పాటు టీవోటీ పద్దతిలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ బాధ్యతలు చేపట్టనుంది. గ్రేటర్ చుట్టూ 6,696 కోట్లు ఖర్చు పెట్టి ఎనిమిది లేన్లతో 158 కిలో మీటర్లు ఔటర్ రింగ్ రోడ్డును హెచ్ఎండీఏ డౌవలప్ చేసింది. 19 ఇంటర్ చేంచ్లు ఉన్న ఓఆర్ఆర్ పై ప్రతీరోజూ 1.75 లక్షలవాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఏడాదికి 421 కోట్ల వరకు టోల్ రూపంలో గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం వచ్చింది.
హెచ్ఎండీఏ ఒకప్పుడు ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని అందించిన సంస్థ. మధ్యలో కొన్నేళ్లపాటు ఆర్థిక నష్టాలు ఎదుర్కొన్నా భూముల అమ్మకం ద్వారా భారీగా ఆదాయాన్ని రాబడుతోంది. అయితే తాజాగా 30ఏళ్ల కాలానికి వసూలయ్యే మొత్తాన్ని ఒకేసారి లీజు ఫీజు తీసుకొని నిర్వహణ సంస్థలకు ఓఆర్ఆర్ను టీవోటీ విధానంలో అప్పగించేలా ప్రణాళిలు సిద్ధం చేసిన అధికారులు అందులో విజయవంతం అయ్యారు. 6వేల కోట్లు ఆశిస్తే 7,380 కోట్లు ఆదాయం సమకూరింది.
Also Read:Filmfare Awards 2023:విజేతలు వీరే
రెండు రౌండ్లు ఫ్రీ బిడ్ మీటింగ్ అధికారులు నిర్వహించారు. ఇందులో భాగంగా 11 సంస్థలు టెండర్లలో పాల్గొనగా నాలుగు సంస్థలు ఫైనాన్సియల్ బిడ్ కు అర్హత సాధించాయి. చివరగా ముంబైకి చెందిన ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ. 7,380 కోట్లకు టెండర్‌ను కైవసం చేసుకుంది.
Also Read:వీటితో..మీ ఆరోగ్యం పదిలం