Filmfare Awards 2023:విజేతలు వీరే

32
- Advertisement -

ముంబై వేదికగా 68వ ‘ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ 2023’ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. బాలీవుడ్ స్టార్స్ సల్మాన్‌ఖాన్, మనీశ్ పాల్ ఈ కార్యక్రమానికి హోస్టులుగా వ్యవహరించగా ఉత్తమ నటిగా ఆలియా భట్ ఎంపికైంది. అలాగే ఆలియా నటించిన గుంగూబాయి కఠియావాడి చిత్రానికి 9 విభాగాల్లో అవార్డులు లభించాయి.
ఉత్తమ చిత్రం,ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు అవార్డులను ఈ చిత్రం గెలుచుకుంది.

బదాయ్ దో సినిమాకు గాను రాజ్‌కుమార్ రావ్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. అదే సినిమాలో నటించిన షీబీ చద్దా ఉత్తమ సహాయనటి అవార్డు అందుకుంది. అత్యధిక నామినేషన్లు దక్కించుకున్న జాబితాలో ఉన్న ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’కు ఒక్క అవార్డు కూడా రాకపోవడం గమనార్హం.

ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) బదాయ్ దో (హర్షవర్ధన్ కులకర్ణి), ఉత్తమ నటుడు (క్రిటిక్స్) సంజయ్ మిశ్రా (వధ్), ఉత్తమ నటి (క్రిటిక్స్) టబు (భూల్ భులయా 2), భూమి పెడ్నేకర్ (బదాయ్ దో), ఉత్తమ సహాయ నటుడిగా జగ్‌జగ్ జీయో సినిమాకు గాను అనిల్ కపూర్ అవార్డులు అందుకున్నారు.

- Advertisement -