ఎండ వేడిమితో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ తీపికబురు అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. భానుడి ప్రతాపంకు తోడు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఈ నేపథ్యంలో రానున్న రెండుమూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడుతుందని పేర్కొంది. ఇవాళ అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలకు, శనివారం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఈదురు గాలులతోపాటు.. వడగండ్ల వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
Also Read:బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన