లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపొందిస్తున్న చిత్రం `2 స్టేట్స్`. చేతన్ భగత్ రాసిన నవల `2 స్టేట్స్` ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో అడవిశేషు, శివానీ రాజశేఖర్ నటిస్తున్నారు. వెంకట్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎం.ఎల్.వి.సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మాత. దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ మధ్యలో దర్శకుడు నిర్మాతలకి మధ్య స్టోరీ మార్పుల విషయంలో నిర్మాత చెప్పిన మార్పులు కథకు ఏమాత్రం న్యాయం చేయలేవని నిర్మాతకు చెప్పిన వినని పక్షంలో షూటింగ్ ఆగిపోయింది.
ఆ తరువాత “2స్టేట్స్” మూవీ ప్రాజెక్ట్‌లో అసలేమి జరుగిగింది అనే విషయమై దర్శకుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ…నేను ముందుగా ముంబై లోని బాలాజీ టెలి ఫిలిమ్స్ లో దర్శకత్వ కోర్స్ పూర్తి చేసుకుని తరువాత స్టార్ దర్శకులు వి.వి. వినాయక్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు చిత్రాలకు పనిచేసి, ఇప్పుడు నేను దర్శకుడికడిగా పరిచయం అవుతున్న చిత్రం “2స్టేట్స్”. ఈ చిత్రం మొదలవుతున్నప్పుడు హీరో, హీరోయిన్ నిర్మాతలకు నేను స్టోరీని పూర్తిగా వినిపించి అందరి అనుమతి పొందిన తరువాత షూటింగ్ మొదలు పెట్టాను. ఇప్పటికి మూవీ 70% పుర్తి చేసుకుంది.
అయితే మా ఆర్టిస్టులు, నిర్మాత మిగతా టెక్నిషన్స్ అందరూ ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ ఔట్ ఫుట్ విషయంలో చాలా ఆనందంగా ఉన్నారు. ఆ విషయాన్ని నిర్మాత కొన్నిరోజుల క్రితం న్యూస్ పేపర్స్ మరియు సోషల్ మీడియాలలో షేర్ చేయడం జరిగింది. సినిమా బాగా వస్తున్న టైంలో నా కథను కొంతమంది పక్కదోవ పట్టించే దిశగా 2స్టేట్స్ కథలో మార్పులు చేయమని నన్ను నిర్మాత అడిగారు. దానికి నేను తిరస్కరించాను. అయితే కొంతమందితో కలిసి నిర్మాత ఎం.ఎల్.వి. సత్యనారాయణ నన్ను ఈ ప్రాజెక్ట్ నుండి తప్పించాలని న్యూస్ పేపర్స్ లో మరియు సోషల్ మీడియాలలో నాపై చేసిన అసత్య ప్రచారం మరియు నన్ను 2స్టేట్స్ మూవీ దర్శకుడిగా తొలగించే ప్రయత్నం జరుగుతుంది అని తెలిసి నేను నిర్మాతపై కోర్ట్‌లో కేసు వెయ్యడం జరిగింది.
సివిల్ కోర్టులో ఉన్న వేకేషన్ కోర్ట్ విచారణ అనంతరం ఈ నెల 30న 2స్టేట్స్ ప్రొడ్యూసర్ ఎం.ఎల్.వి.సత్యనారాయణ (సత్తిబాబు)ని వివరణ కోరింది. 2స్టేట్స్ సినిమాకు నేను దర్శకత్వంతో పాటు వన్ ఆఫ్ ది పాట్నర్ మరియు ప్రాఫిట్ హోల్డర్ని ఈ చిత్ర హక్కులు మరియు 2స్టేట్స్ రిమేక్ రైట్స్ ముంబాయ్‌లో చేసిన అగ్రిమెంట్ ప్రకారం ఈ సినిమా పూర్తిగా దర్శకత్వం వహించే హక్కులు నాకు మాత్రమే ఉన్నాయి. నేను కాకుండా ఎవరైనా ఈ చిత్రాన్ని మిగతా 30% షూటింగ్ పూర్తి చేయాలని వచ్చిన దర్శకుడుకి చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. అంతేకాదు 2స్టేట్స్ మూవీ కథ మార్పులు చేసి నన్ను ప్రాజెక్ట్ నుండి దూరం చేయాలనుకున్న అందరి పేర్లు మరియు మరికొన్ని విషయాలు కోర్టు వారితో సంప్రదించి త్వరలో బయట పెడతానని “2స్టేట్స్” చిత్ర దర్శకుడు వెంకటరెడ్డి తెలిపారు.
కోర్టు కేసు వివరములు: O.P NO. 3 of 2019. Next day of hearing 30/5/2019.. Vacation Court C.C.C. Hyderabad