సాహో.. ఆకట్టుకుంటున్న ప్రభాస్ న్యూ లుక్‌..

200
Saaho

బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘సాహో’. రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్‌లో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను ఈ యేడాది ఆగష్టు 15 కానుకగా విడుదల చేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ కావొస్తోన్న ఈ చిత్రంపై పూటకో గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. ఇదిలావుంటే ఇటీవల ఈ సినిమా నుంచి ప్రభాస్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేయగా దానికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ సినిమా నుంచి మరొక పోస్టర్ ను విడుదల చేశారు. బైక్ పై ప్రభాస్ దూసుకెళ్లే ఈ పోస్టర్ ఆయన అభిమానులను ఖుషీ చేసేలా వుంది. ఈ సినిమాలో బైక్ ఛేజింగ్ సీన్స్ హాలీవుడ్ సినిమాల స్థాయిలో వుంటాయనే విషయం తెలిసిందే. యాక్షన్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయనే ప్రచారం మొదటి నుంచి సాగుతూనే వుంది. ప్రభాస్ చేసిన సాహసోపేత విన్యాసాల కోసం ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు.