శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ దేశంలోనే అగ్రస్ధానంలో ఉందన్నారు హోంమంత్రి మహమూద్ అలీ . మహిళా దినోత్సవం సందర్భంగా షీ టీమ్స్ ఆధ్వర్యంలో నగరంలోని చార్మినార్ వద్ద షీ టీమ్స్, హైదరాబాద్ నగర పోలీస్ ఆధ్వర్యంలో 5కె, 2కె పరుగును నిర్వహించారు. డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి జెండా ఊపి పరుగును ప్రారంభించిన మహమూద్ అలీ మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
షీ టీమ్స్ రాకతో మహిళలు అర్థరాత్రి కూడా ధైర్యంగా తిరుగుతున్నారన్నారు. పోలీస్‌శాఖలో 17 వేల పోస్టుల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు హోంమంత్రి వెల్లడించారు.
మహిళల భద్రత కోసం షీ టీమ్స్ నిరంతరం పనిచేస్తున్నాయన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. దేశంలోనే అత్యంత అద్భుతమైన ప్రదేశం చార్మినార్ అన్నారు. షీ టీమ్స్ ఇన్‌ఛార్జి స్వాతిలక్రా మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత ఐదేళ్ల నుంచి షీ బృందాలు పనిచేస్తున్నాయన్నారు.