బిగ్ బాస్ 5…కెప్టెన్సీ టాస్క్ రచ్చరచ్చ

83
bb5

బిగ్ బాస్ 5 తెలుగు రెండో వారం కెప్టెన్సీ పోటీదారుకోసం పెట్టిన టాస్క్‌ రచ్చ రచ్చగా మారింది. ఆడ, మగ తేడా లేకుండా ఒకరిపైకి ఒకరు ఎక్కి నానా హంగామా చేసేశారు. కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇలా ఆసక్తికరంగా సాగింది ఎపిసోడ్.

పంతం నీదా నాదీ.. అనే పేరుతో మొదటి టాస్క్ ‘దొంగలున్నారు జాగ్రత్త’.. టాస్క్‌లో భాగంగా పిల్లోస్ లాక్కునే క్రమంలో సిరి షర్ట్‌లో సన్నీ చేయి పెట్టాడని పెద్ద గొడవ చేస్తుంది. నేను అలా చెయ్యలేదు అంటూ వాదనకు దిగుతాడు సన్నీ. ఇక తోపులాటలో లోబోకు పెయిన్ రావడంతో డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్తారు. తర్వాత రవి-విశ్వకి మధ్య మాటలయుద్దం జరుగగా ఇది టాస్క్‌లా కనిపించలేదు. ఒకరిపై ఒకరు ఎక్కేసి చాలా అసహ్యంగా ప్రవర్తించారు.

నిన్నటి ఎపిసోడ్‌లో నటరాజ్ మాస్టర్ గుంటనక్క అంటూ సంభోదిస్తూ మాట్లాడటంపై మాస్టర్‌తో చర్చిస్తారు రవి. ఎందుకు అంతలా ఊహించుకుంటున్నారు మాస్టర్? అని రవి అనగా నామినేషన్ ఓట్లు ఎలా పడ్డాయో నాకు తెలుసు అంటూ రవికి సమాధానం చెబుతారు. ఇక లోబో దగ్గరికి వచ్చిన మానస్… నామినేట్ చెయ్యడానికి మీరు తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు అంటూ చెప్పి ఓదార్చే ప్రయత్నం చేస్తాడు.

ఇక అంతకముందు ఉదయాన్నే ‘ముక్కాలా ముక్కాబులా’ సాంగ్‌తో అదిరిపోయే డాన్స్ చేశారు బిగ్ బాస్ సభ్యులు. శ్రీరామ్ చంద్ర, మాస్టర్ ఆనీ మాట్లాడుకుంటూ.. నిన్నటితో ఎవరు ఏంటీ అనేది బాగా తెలిసిపోయింది అంటూ బాధపడిపోతుంది.

ఇక సన్నీ.. నటరాజ్ మాస్టర్ దగ్గరకు వెళ్లి.. మీరన్న గుంటనక్క ఒక్కరే అని అర్థమైంది కానీ.. ఎవరు? ఎవరిని అన్నారు?’ అంటూ ఆరా తీస్తాడు. అదే సమయంలో బిగ్ బాస్ స్కీన్ మీద రవిని చూపిస్తుంటే.. మీకు వచ్చేసిందిగా క్లారిటీ అంటాడు నటరాజ్ మాస్టర్.