దేశంలో 24 గంటల్లో 2487 కరోనా కేసులు..

22
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 2,487 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 13 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,31,21,599కు చేరగా 4,25,76,815 మంది కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 17,692 యాక్టివ్ కేసులుండగా 5,24,214 మంది మృతిచెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.59 శాతానికి పడిపోగా గత 24 గంటల్లో ఢిల్లీలో 673 ఉండగా, కేరళలో 523, హర్యానాలో 343, మహారాష్ట్రలో 248, ఉత్తరప్రదేశ్‌లో 158, కర్ణాటకలో 103 కేసులు నమోదయ్యాయి.