మళ్లీ పెరిగిన సీఎన్జీ ధరలు..

27

ధరల పెంపు దేశంలో సాధారణమై పోయింది. గత వారం సిలిండర్ ధరలు పెరుగగా తాజాగా సీఎన్జీ ధరలు పెరిగాయి. ఢిల్లీ ఎన్సీఆర్‌తోపాటు పలు ప్రాంతాల్లో ఇంద్రప్రస్త గ్యాస్‌ లిమిటెడ్‌ (ఐజీఎల్‌) కిలో సీఎన్జీపై రూ.2 చొప్పున భారం మోపింది. దీంతో ఢిల్లీలో కిలో సీఎన్జీ ధర రూ.73.61కి చేరింది.

నోయిడాలో రూ.76.71, గుర్‌గావ్‌లో రూ.81.94, రేవారిలో రూ.84.07, కైతాలిలో రూ.82.27, ఫతేపూర్‌, కాన్పూర్‌లో రూ.85.40కు చేరాయి. ఏప్రిల్‌ మొదటి వారంలో సీఎన్జీ కిలోకి రూ.2.50 పెరగగా, పైపుల్లో సరఫరా చేసే గ్యాస్‌ ధర రూ.4.25 అధికమయింది.