భారత్‌లో పెరిగిన కరోనా కేసులు..

58
Covid-19 cases

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోయాయి. గత 24 గంటల్లో 22,775 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 406 మంది కోవిడ్‌ బాధితులు కన్నుమూశారు. ప్రస్తుతం దేశంలో 1,04,781 యాక్టివ్‌ కేసులు ఉండగా.. రివకరీ రేటు 98.32 శాతంగా ఉందని వైద్యశాఖ వెల్లడించింది. మరోవైపు దేశంలో ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,431కు చేరింది.

అత్యధికంగా మహారాష్ట్రలో 454 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, ఢిల్లీలో 351, తమిళనాడులో 118, గుజరాత్‌లో 115, కేరళలలో 109, రాజస్థాన్‌లో 69, తెలంగాణలో 62 కేసులు ఉన్నాయి.