భోశా శంకర్…న్యూ ఇయర్ ట్రీట్

26
chiru

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భోళా శంకర్. ఈ ఏడాది సినిమా విడుదల కానుండగా ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ ట్రీట్ ఇచ్చారు మెగాస్టార్. స్వాగ్ ఆఫ్ బోలా అంటూ మేకర్స్ మెగా మాస్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ప్రీ లుక్ పోస్టర్‌లో చిరంజీవి తన ముఖాన్ని చేతితో కప్పుకున్నట్లు కనిపిస్తోంది. ఆయన చేతికి పవిత్రమైన దారాలను మనం చూడవచ్చు. మెగాస్టార్ స్టైలిష్ హెయిర్‌డోతో పోస్టర్‌లో కనువిందు చేశాడు.

ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా చిరుతో రొమాన్స్ చేయనుంది. కీర్తి సురేష్ ఆయనకు సోదరిగా కనిపించబోతోంది.

SWAG of BHOLAA | Mega Star Chiranjeevi's BHOLÃ SHANKAR | Meher Ramesh | Anil Sunkara #BholaaShankar