మాంచెస్టర్‌లో ఐసిస్ ఉగ్రదాడి..22 మంది మృతి

183
22 dead in bomb blast
- Advertisement -

ఇంగ్లాండ్‌లోని ప్రముఖ పారిశ్రామిక నగరం మాంచెస్టర్‌ ఐసిస్ ఉగ్రవాదులు విరుచుక పడ్డారు. అమెరికా పాప్‌స్టార్‌ అరియానా గ్రాండే సంగీత కచేరీ జరుగుతున్న వేదికకు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 22 మంది మృతిచెందగా.. 59 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తలరించేందుకు 60 అంబులెన్స్‌లు ఏర్పాటుచేశారు. కాగా.. దాడికి పాల్పడింది ఒక్కరేనని పోలీసులు తెలిపారు.

సోమవారం రాత్రి 10.35 గంటలకు పేలుడు సంభవించినట్లు గ్రేటర్‌ మాంచెస్టర్‌ పోలీసులు వెల్లడించారు. ఈ దాడిలో పాప్‌ సింగర్‌ అరియానాకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, ఆమె క్షేమంగా ఉన్నారని ఆమె ప్రతినిధి ప్రకటించారు. అరియానా కన్సర్ట్‌ను వీక్షించేందుకు 21వేల మంది అభిమానులు హాజరయ్యారు. వీరిలో చాలా మంది 6 నుంచి 20 సంవత్సరాల వయసు గలవారే. అయితే బాంబు వేదిక వెలుపల పేలడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు చెబుతున్నారు.

22 dead in bomb blast
మాంచెస్టర్ లో ఆత్మాహుతి దాడి మేం చేసిందే.. ఇది ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో విరుచుకుపడతాం అంటూ ప్రకటించింది ఉగ్రవాద సంస్థ ఐసిస్. మరిన్ని దాడులు చేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చింది. మోసుల్ లో దాడులకు ప్రతీకారమే ఇది అని కామెంట్లు చేసింది ట్విట్టర్ లో పేర్కొంది. లక్ష్యం సాధించాం.. సంబురాలు చేసుకునే సమయం అంటూ ఓ ఫొటోతో ట్విట్టర్ లో కామెంట్ చేసింది ఐసిస్.

ఘటనపై బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. మరోవైపు మాంచెస్టర్ ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. మాంచెస్టర్ ఉగ్ర దాడి మనస్తాపానికి గురిచేసిందని.. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని మృతుల ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటున్నా ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు. మాంచెస్టర్‌లో పేలుడు జరిగిందని తెలిసి షాకయ్యానని… మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నానని రాష్ట్రపతి ప్రణబ్ తెలిపారు.

- Advertisement -