విమాన ప్రమాదంలో షారుఖ్ మృతి..?

252
Shah Rukh Khan Dead..?
- Advertisement -

బాలీవుడ్‌ బాద్‌ షా,కింగ్‌ఖాన్‌ షారుక్‌ ఖాన్‌ విమాన ప్రమాదంలో చనిపోయాడంటూ యూరప్‌కి చెందిన ఓ న్యూస్‌ ఛానెల్‌ ప్రసారం చేసింది.  షారుక్‌ ఫొటోను చూపిస్తూ … ‘షారుక్‌ బిజినెస్‌ పని మీద పారిస్‌ చేరుకోవాల్సి ఉంది. ఆయన ప్రయాణిస్తున్న గల్ఫ్‌స్ట్రీం జీ550 జెట్‌ తీవ్రగాలుల కారణంగా కూలిపోయింది. ఆ ప్రమాదంలో షారుక్‌తో పాటు మరో ఏడుగురు చనిపోయారు.’ అని ఛానెల్‌ ప్రసారం చేసింది. దీంతో షారుక్ అభిమానులు విషాద వదనంలో మునిగిపోయారు.

షారుక్‌ మరణ వార్త కాస్తా వైరల్‌గా మారడంతో యావత్‌ భారతదేశం ఉలిక్కిపడింది. షారుక్‌కి తెలిసిన వారందరికీ ఉదయం నుంచి ఒకటే ఫోన్లు వస్తున్నాయని బాలీవుడ్‌ వర్గాల సమాచారం. అయితే ఈ వార్తలు అవాస్తం. ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టించకండి అంటూ షారుక్‌ అభిమానులు సోషల్‌మీడియాలో విజ్ఞప్తి చేస్తున్నారు.

షారుక్‌ ప్రస్తుతం ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ దర్శకత్వంలో వస్తున్న ‘డ్వార్ఫ్‌’ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ మీరట్‌లో జరుగుతోంది. మూడు రోజుల క్రితం సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో షారుక్ కూర్చున్న సీటు దగ్గర్లోనే సినిమా సెట్ పైభాగం(రూఫ్‌) ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో అంతా ఆందోళన చెందారు. ఈ ప్రమాదంలో షారుక్ ఎలాంటి గాయాలు లేకుండా బయటపడినా ఇద్దరు సిబ్బందికి మాత్రం గాయాలయ్యాయి. దీంతో రెండు రోజుల పాటు షూటింగ్‌ను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో షారుక్ మరణ వార్త ఒక్కసారిగా కలకలం రేపింది.

- Advertisement -