- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తున్న కేసుల సంఖ్య మాత్రం ఆగడం లేదు. గత 24 గంటల్లో 1,42,497 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా 2,151 కరోనా కేసులు బయటపడ్డాయి. ఇది గత 5 నెలల్లో గరిష్టం కావడం విశేషం.
ప్రస్తుతం దేశంలో 11,903 కేసులు యాక్టివ్‌గా ఉండగా మొత్తం కేసుల సంఖ్య 4,47,09,676కి చేరాయి. ఇప్పటి వరకు కరోనా నుండి 4,41,66,925 మంది కోలుకోగా ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 0.03 శాతం యాక్టివ్‌గా ఉండగా రికవరీ రేటు 98.78 శాతంగా ఏంది. మరణాలు 1.19 శాతంగా ఉండగా మహారాష్ట్రలో ముగ్గురు, కేరళ లో ముగ్గురు, కర్ణాటకలో ఒకరు చొప్పున మొత్తం ఏడుగురు మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 5,30,848కి చేరాయి.
- Advertisement -