- Advertisement -
బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో భారీగా పెరిగాయి. ఇవాళ ఒక్కరోజే హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1420 పెరిగి రూ.68,730కి చేరగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.1300 పెరిగి ర63 వేల మార్క్‌గా ఉంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1300 పెరిగి రూ. 63,150 వద్ద ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 68,880గా ఉంది. బంగారం బాటలోనే వెండి ధరలు పెరిగాయి. కేజీ వెండి ధర రూ. 300 పెరిగి రూ. 77,800గా ఉండగా హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.300 పెరిగి రూ. 80,800గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2234.05 డాలర్ల వద్ద ట్రేడవుతోండగా స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు 24.99 డాలర్లుగా ఉంది. డాలర్‌తో చూస్తే మారకం విలువ రూ. 83.378గా ఉంది.
Also Read:భోజనానికి ముందు పెరుగు తింటే?
- Advertisement -