2024లో మహా సంగ్రామమే?

16
- Advertisement -

ఈ ఏడాది జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు అత్యంత కీలకమనే చెప్పాలి. ఎందుకంటే ఈ రెండు పార్టీల భవిష్యత్ నిర్ణయించే లోక్ సభ ఎన్నికలు ఈ ఏడాదిలోనే జరగనున్నాయి. మార్చి లేదా ఏప్రెల్ లో ఎన్నికలు జరగనుండగా ఈసారి కూడా విజయం సాధించి మూడో సారి అధికారం సొంతం చేసుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంది. అటు కాంగ్రెస్ కూడా విపక్ష పార్టీలన్నిటితో కలిసి ఇండియా కూటమిగా ఏర్పడి బీజేపీపై దండయాత్రకు సిద్ధమైన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది మార్చి లేదా ఏప్రెల్ లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో దేశ ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇరు పార్టీలు ఇప్పటికే ఎన్నికల ప్రణాళికలను మొదలుపెట్టాయి కూడా. 2014, 2019 ఎన్నికల్లో మోడీ మేనియాతో బీజేపీ అధిక సీట్లను సొంతం చేసుకుంది. ఈసారి కూడా మోడీపైనే పూర్తి భారం వేసింది కాషాయ పార్టీ. .

గతంలో కంటే మెరుగ్గా ఈసారి 300 కూడా పైగా సీట్లు సాధించాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఇప్పటికే సీట్ల కేటాయింపుపై ముమ్మర కసరత్తులు కూడా చేస్తోంది కాషాయ పార్టీ. అటు కాంగ్రెస్ కూడా విపక్షాలతో కలిసి సీట్ల కేటాయింపు, పిఎం అభ్యర్థి ఎంపిక వంటి అంశాలపై దృష్టి సరిస్తోంది. గతంతో పోల్చితే కాంగ్రెస్ కొంత మెరుగ్గానే కనిపిస్తోంది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు దేశ వ్యాప్తంగా మంచి స్పందన రావడం కాంగ్రెస్ కు మైలేజ్ తీసుకొచ్చిన అంశం. ఇక అదే జోష్ ను ఎన్నికల వరకు కొనసాగిస్తు బీజేపీకి చెక్ పెట్టాలని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే ఇండియా కూటమిలో అప్పుడప్పుడు ఏర్పడుతున్న అసమ్మతి సెగలు కాంగ్రెస్ ను కలవరపరిచే అంశం. దాంతో ఎన్నికల సమయం వరకు కూటమి బలంగా ఉంటుందా లేదా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఇటు బీజేపీకి గాని అటు కాంగ్రెస్ కు గాని 2024 సంవత్సరం అత్యంత కీలకంగా మారింది. మరి ఈ ఏడాది ఏ పార్టీకి కలిసొస్తుందో చూడాలి.

Also Read:సీఎం రేవంత్ కీలక నిర్ణయం..

- Advertisement -