2023లో భారీ సినిమాల లిస్టు…

78
- Advertisement -

2022వ సంవత్సరం  టాలీవుడ్‌ పరిశ్రమ విషాదాలతో ముగించింది. కానీ 2023లో భారీ సినిమాలు అలరించనున్నాయి. సంక్రాంతి నుంచి మొదలుకొని డిసెంబర్‌ నెల వరకు వరస సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో నిలవనున్నాయి. గత సంవత్సరం మంచి సినిమాలు చాలా వరకు వచ్చిన ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి అనేది నిజం.

చిరంజీవి సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో సందడి చేయనున్నారు. అయితే 4 నెలలు తిరక్కుండానే ఎప్రిల్ 14న భోళా శంకర్‌గా రాబోతున్నారు. వీరసింహారెడ్డిగా సంక్రాంతికి సై అంటున్న బాలయ్య.. అనిల్ రావిపూడి సినిమాను దసరాకు దించేయాలని ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో వస్తున్న రామ్ చరణ్ సినిమా 2023లోనే రాబోతుంది. పవన్ కళ్యాణ్ సైతం మండే ఎండలో హరిహర వీరమల్లుతో పాటు రానున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ సైతం కొరటాల శివ సినిమాను ఇదే ఏడాది విడుదల చేయనున్నారు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ హాలీడే ట్రిప్‌లో ఉన్నారు. హాలీడే పూర్తవగానే సినిమాలతో కుస్తీ పడతారని టాలీవుడ్‌లో టాక్. విజయ్ దేవరకొండ ఇటు ఖుషీతో పాటు.. అటు గౌతమ్ తిన్ననూరి సినిమాలను 2023లోనే తీసుకురానున్నారు.

మహేష్ బాబు సినిమాను జనవరిలోనే మొదలుపెట్టి.. సమ్మర్ రిలీజ్‌కు ప్లాన్ చేశారు దర్శకుడు త్రివిక్రమ్. అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ మొదలు కాకపోవడంతో.. 2023లో రావడం కష్టమే. మొత్తానికి ఈ ఏడాది భారీ సినిమాలతో రానున్నాయి. దీంతో సినిమాలు మొత్తం వరసగా పాన్ ఇండియా స్థాయిలో ఉండటంతో అన్ని పరిశ్రమల సినిమాలు కూడా టాలీవుడ్‌ సినిమాల వైపు ఎదురు చూస్తున్నారు. మరీ సినిమాలు తుస్సు మంటయా…లేక కాసుల కనక వర్షం కురుస్తుందా…  వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి…

వీరయ్యకు యూఎ సర్టిఫికేట్

వీరసింహారెడ్డి విజువల్ ఫీస్ట్:రిషి

స్టార్‌ హీరో పై మనసుపడ్డ త్రిష

- Advertisement -