లే బాబాయ్.. లే.. ఎమోషనలైన ఎన్టీఆర్

205
- Advertisement -

సీనియర్ నటుడు చలపతిరావు హఠాన్మరణం టాలీవుడ్ ను దిగ్భ్రాంతికి గురి చేసింది. వేలాది చిత్రాల ద్వారా ప్రేక్షకులను అలరించిన ఈ లోకాన్ని విడిచివెళ్లిపోవడం బాధాకరమైన విషయం. తన తండ్రి చలపతిరావు అంత్యక్రియలు బుధవారం రోజున మహాప్రస్థానంలో జరుగుతాయని కుమారుడు రవిబాబు వెల్లడించారు. తన సోదరి అమెరికా నుంచి రావాల్సి ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం అన్నారు. అభిమానుల సందర్శనార్థం ఈరోజు మధ్యాహ్నం వరకు ఆయన భౌతిక కాయాన్ని రవిబాబు నివాసంలో ఉంచనున్నారు. 3గంటల తర్వాత ఫిలింనగర్ మహా ప్రస్థానంలోని ఉంచుతామని వెల్లడించారు.

చలపతి రావు మరణంపై జూ.ఎన్టీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ”నందమూరి ఫ్యామిలీ ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయింది. తాత గారి రోజుల నుంచి మాకు చలపతి బాబాయ్ ఎంతో ఆప్తుడు. బాబాయ్ అకాల మరణం నన్ను ఎంతగానో కలచివేసింది. లే బాబాయ్.. లే అంటూ” జూ.ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

అలాగే పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సంతాపం తెలిపారు. ఆయన మృతి బాధాకరమని అన్నారు. ప్రతినాయకుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తనదైన ముద్ర వేశారని చెప్పారు. నిర్మాతగా మంచి చిత్రాలు నిర్మించారని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని వెల్లడించారు. చలపతిరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -