2021లో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..!

66
tollywood

కరోనా తర్వాత పూర్తి స్ధాయి ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. మెగా కాంపౌండ్ నుండి వచ్చిన పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఉప్పెన…భారతీయ సినీ చరిత్రలో రికార్డులను తిరగరాసింది. థియేటర్లు హౌస్‌ ఫుల్ కాగా రికార్డు వసూళ్లను రాబట్టి తెలుగు సినిమా సత్తాను చాటింది.

ఇక ఇదే బాటలో ఈ సంవత్సరం పలువురు అగ్రహీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఫిబ్రవరి 19న నితిన్ నటించిన చెక్ రిలీజ్ కానుండగా సందీప్ కిషన్ ఏ1 ఎక్స్‌ప్రెస్ ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది. దీంతో పాటు ఫిబ్రవరి 26న అక్షర, మార్చి 5 అర్ధశతాబ్దం,మార్చి 11న శర్వానంద్ శ్రీకారం, మార్చి 11న గాలి సంపత్ విడుదల కానుంది.

నితిన్ నటించిన రంగ్‌ దే మార్చి 26న విడుదల కానుండగా ,రానా అరణ్య మార్చి 26న, గోపిచంద్ మూవీ ఏప్రిల్ 2న విడుదల కానుంది. పవన్ నటించిన వకీల్ సాబ్ ఏప్రిల్ 9న,నాని టక్ జగదీష్ ఏప్రిల్ 16న,నాగచైతన్య లవ్ స్టోరీ ఏప్రిల్ 16న విడుదల కానుంది. రానా.. విరాటపర్వం ఏప్రిల్ 30న,చిరంజీవి ఆచార్య మే 13న,వెంకీ నారప్ప మే 14న విడుదల కానుంది. బాలయ్య-బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న మూవీ మే 28న,మేజర్ జూలై 2న విడుదల కానుంది. గని జూలై 30న,మహాసముద్రం ఆగస్టు 19న,ఎఫ్‌ 3 ఆగస్టు 2న రిలీజ్ కానుంది.