ఐపీఎల్‌ వేలంలో 292 మంది ఆటగాళ్లు…

58
ipl auction

ఐపీఎల్ 14వ సీజన్‌ వేలానికి రంగం సిద్ధమైంది. మధ్యాహ్నం 3 గంటల నుండి చెన్నైలో ఈ వేలం జరగనుండగా మొత్తం 292 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 164 మంది భారత ఆటగాళ్లు ఉండగా 125 మంది విదేశీ ఆటగాళ్లు, ముగ్గురు అసోసియేట్ దేశాల ఆటగాళ్లు ఉన్నారు.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ దగ్గర 19 కోట్ల 90 లక్షలు ఉండగా ఆరుగురు ప్లేయర్లను తీసుకోనుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ 8 మంది ఆటగాళ్లను తీసుకోవడానికి 13 కోట్లను ఖర్చు చేయనుంది. రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు 14 మంది ప్లేయర్లను వేలంలో కొనుగోలు చేసే అవకాశం ఉండగా స‌న్‌రైజర్స్ హైద‌రాబాద్‌ ముగ్గురు ప్లేయర్లను 10 కోట్ల 75 లక్షలు వెచ్చించి వేలంలో తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

పంజాబ్‌ కింగ్స్‌ 9 మందిని వేలంలో తీసుకోనుండగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 8 మంది క్రికెటర్లను తీసుకునే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్‌ ఏడుగురు ప్లేయర్లను,రాజస్థాన్‌ రాయల్స్‌ కూడా 9 మంది ప్లేయర్లను తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈసారి వేలంలో సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కూడా ఉండటంతో అతడిని ఎవరు దక్కించుకుంటారోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.