2011వరల్డ్‌కప్‌..చివరి సిక్స్ తాకిన బెంచ్‌కు ధోనీ పేరు.!

46
- Advertisement -

అది 2011 ఏప్రిల్‌2వ తేదీన భారత క్రికెట్‌ చరిత్ర సృష్టించిన రోజు..సరిగ్గా 12ఏళ్ల తర్వాత మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీలంకతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో చివరి సిక్స్‌ కొట్టి…యావత్‌ భారతీయుల కలను నిజం చేసిన ఆ అపురూప క్షణాలను ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేరు. ఇందుకు వేదికైన ముంబాయిలోని వాంఖడే స్టేడియంలో ఓ సీటుకు ధోనీ పేరు పెట్టాలని ఎంసీఏ నిర్ణయం తీసుకుంది.

మహేంద్ర సింగ్ ధోని కొట్టిన చివరి సిక్స్‌ ఎక్కడైతే పడిందో ఆ సీటుకు ధోని పేరు పెట్టనున్నట్టు ఎంసీఏ అధ్యక్షుడు అమోల్‌ కాలే తెలిపారు. ఇప్పటి వరకూ ఈ స్టేడియంలోని స్టాండ్స్‌లకు సచిన్, గావస్కర్‌, విజయ్‌ మర్చంట్ పేర్లు పెట్టిన విషయం తెలిసిందే. స్టేడియం గేట్లకు పాలీ ఉమ్రిగర్ వినూ మన్కడ్‌ పేర్లు ఉన్నాయి. అలాగే సచిన్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు.

ఈ సందర్బంగా ఫైనల్ మ్యాచ్‌ సందర్బంగా అత్యుత్తమ ఫీలింగ్ ఏంటని ధోనీని అడిగితే విభిన్నంగా స్పందించారు. తనకు అత్యుత్తమ క్షణాలు..చివర్లో కొట్టిన సిక్స్ కాదన్నారు. అలాగే ఫైనల్‌లో విజయం సాధించడానికి ఓ పావు గంట ముందు నుంచే బెస్ట్‌ ఫీలింగ్‌ ఏంటో అనుభవించానని అన్నారు. అప్పటికే మేం విజయాతీరాలకు చేరుకున్నామని అప్పటి నుంచి విజయానందం అనుభవిస్తున్నామని తెలిపారు. అంతేకాదు వందేమాతరం అంటూ స్టేడియంలో అభిమానులు పాడటం ప్రారంభించారు. అవే నాకు అత్యుత్తమ క్షణాలుగా అనిపించాయని అంటూ ధోనీ తన దేశభక్తిని చాటుకున్నారు.

ఇవి కూడా చదవండి…

IPL 2023 : డిల్లీ vs గుజరాత్.. డిల్లీకి అదే మైనస్!

IPL 2023: ముంబై చెత్త రికార్డు

CMKCR:దళితుల తరపున సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు..

- Advertisement -