రాష్ట్రంలో 24 గంటల్లో 3037 కరోనా కేసులు..

21
Corona in ts

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 3037 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 8 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 3,37,775కు చేరాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 27,861 యాక్టివ్ కేసులుండగా 1788 మంది మరణించగా 3,08,396 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. కొత్త‌గా న‌మోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ ప‌రిధిలో 446, మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి జిల్లాలో 314, నిజామాబాద్‌లో 279 చొప్పున ఉన్నాయి.