దేశంలో కొత్త‌గా 2.34 లక్షల క‌రోనా కేసులు నమోదు..

65
- Advertisement -

దేశంలో కొత్త‌గా 2,34,281 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 4,10,92,522కి చేరుకుంది. అలాగే, నిన్న‌ 893 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. నిన్న‌ క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య‌ 3,52,784 గా ఉంది. ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 18,84,937 మందికి చికిత్స అందుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 14.50 శాతంగా ఉంది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,65,70,60,692 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.

- Advertisement -