‘జిగేల్’ మూవీ తొలి షెడ్యూల్ పూర్తి..

263
Jigel Movie
- Advertisement -

అరుణ్ ఆదిత్ నటిస్తున్న తాజా చిత్రం “జిగేల్”. శ్రీ ఇందిరా కంబైన్స్ పతాకంపై అల్లం నాగార్జున నిర్మాణ సారధ్యంలో నిర్మాణమవుతున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయింది. అరుణ్ ఆదిత్ సరసన “జంబ లకిడి పంబ” ఫేమ్ సిద్ధి ఇద్నాని కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మల్లి యేలూరి దర్శకత్వం వహిస్తున్నారు.

Jigel Movie

దర్శకుడు మల్లి యేలూరి మాట్లాడుతూ.. కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న జిగేల్ తొలి షెడ్యూల్ పూర్తయింది. జులై 30 నుంచి రెండో షెడ్యూల్ మొదలవుతుంది. ఆగస్ట్ 20 వరకు జరిగే చిత్రీకరణలో టాకీ పార్ట్ కంప్లీట్ అవుతుంది. సెప్టెంబర్‌లో సినిమా టోటల్ షూట్ పూర్తి చేస్తామన్నారు.

చిత్ర నిర్మాత అల్లం నాగార్జున మాట్లాడుతూ.. “భారీ తారాగణంతో, కథకు తగ్గ బడ్జెట్‌తో తెరకెక్కనున్న హైక్వాలిటీ చిత్రం “జిగేల్”. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ది బెస్ట్ టీమ్ వర్క్ చేస్తున్నారు. కథే ఈ విత్రానికి ప్రధాన బలం. మా టీమ్ అందరికి మంచి పేరును జిగేల్ తీసుకువస్తుందన్నారు.

Jigel Movie

జయప్రకాష్ రెడ్డి, ఆశిష్ విద్యార్ధి, పోసాని కృష్ణమురళి, సత్య, సత్యం రాజేష్, రఘుబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వాసు, సంగీతం: మంత్ర ఆనంద్, కథ- కధనం: అల్లం నాగార్జున, మాటలు: అల్లం నాగార్జున, రమేష్ చెప్పాల, పాటలు: రామజొగయ్య శాస్త్రి, ఆర్ట్ : వర్మ, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, కొ- డైరక్టర్ : మేడి కె స్వామి, పి.ఆర్.ఓ: సాయి సతీష్. నిర్మాత: అల్లం నాగార్జున, దర్శకత్వం:మల్లి యేలూరి.

- Advertisement -