వర్మ పాడిన పాట ‘భలే భలే’గా ఉంది.. మీరూ వినండి..!

33
Bhale Bhale Song

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కంపెనీ ప్రొడక్షన్ నిర్మాణంలో అదిత్ అరుణ్, ఇరా మోర్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం “కొండా”. తెలంగాణలో నిజ జీవిత సంఘటల ఆధారంగా జరిగిన సాయుధ పోరాట కథతో తెరకెక్కిస్తున్న మూవీ ఇది. వరంగల్ పరిసరప్రాంతాలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో విప్లవ గాయకుడు నల్గొండ గద్దర్, రామ్ గోపాల్ వర్మ కలిసి “భలే భలే” అనే ఒక విప్లవ పాట పాడటం విశేషం. ఈ గీతాన్ని డిసెంబర్ ఈరోజు విడుదల చేశారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. “కొండా చిత్రాన్ని వరంగల్‌లో ఘనంగా ప్రారంభించాము. ఈ చిత్రాన్ని వరంగల్ లోనే చిత్రీకరించాలి అని ప్లాన్ చేసాం. కానీ కొంతమంది కుతంత్రాల మూలాన వరంగల్‌లో పూర్తి షెడ్యూల్ జరగలేదు. కొంత షూటింగ్ వేరే లొకేషన్స్ లో చేసాము. కానీ ఇప్పుడు ఆ కుయుక్తులను అధిగమించి వరంగల్ లోనే షూటింగ్ చేస్తున్నాము. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం” అన్నారు.

సినిమా పేరు – కొండా
బ్యానర్ – కంపెనీ ప్రొడక్షన్
నటీనటులు : అదిత్ అరుణ్, ఇరా మోర్ తదితరులు
కెమెరా మాన్ – మల్హర్భట్ జోషి
పి అర్ ఓ – పాల్ పవన్
దర్శకుడు – రామ్ గోపాల్ వర్మ

Bhale Bhale Song | Ram Gopal Varma & Nalgonda Gaddar | Konda Movie | Adith Arun, Irra Mor