దేశంలో 24 గంటల్లో 1,96,427 కరోనా కేసులు..

62
covid

దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,96,427 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 3511 మంది మృతిచెందారు. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,69,48,874కు చేరగా 2,40,54,861 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 25,86,782 యాక్టివ్ కేసులుండగా ఇప్పటి వరకు 3,07,231 మంది కరోనాతో మృతిచెందారు. టీకా డ్రైవ్‌లో భాగంగా 19,85,38,999 డోసులు వేయగా ఇప్పటి వరకు 33,25,94,176 టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.