కరోనా బాధితులకు అండగా బీసీసీఐ…

298
bcci
- Advertisement -

కరోనా బాదితులకు అండగా నిలిచింది బీసీసీఐ. కరోనా కష్టకాలంలో వైద్య సంస్థలకు భారీ విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించింది బీసీసీఐ. వివిధ వైద్య సంస్థలకు 10 లీటర్ల చొప్పున 2 వేల ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపింది.

కరోనావైరస్ సెకండ్ వేవ్ ఉదృతితో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రత్యేకించి మెడికల్ మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలు, ఆక్సిజన్ సరఫరాకు డిమాండ్ పెరగడంతో రాబోయే కొద్ది నెలల్లో, కరోనా రోగులకు అత్యవసర వైద్య సహాయం సంరక్షణ అందించాలని బీసీసీఐ భావిస్తోంది.

గత ఏడాది PM కేర్స్ ఫండ్‌కు రూ.51 కోట్లు విరాళం ఇచ్చింది బీసీసీఐ. వైరస్‌పై సాగుతున్న సుదీర్ఘ యుద్ధంలో పోరాడుతున్న వైద్య, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల విశేష కృషిని బీసీసీఐ ప్రత్యేకంగా అభినందించింది.

- Advertisement -