దేశంలో 24 గంటల్లో 18,870 కరోనా కేసులు..

82
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా రెండోరోజు 20 వేలకు దిగువలో కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 18,870 కరోనా కేసులు నమోదుకాగా 378 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,37,16,451కు చేరింది.

కరోనా నుండి 3,29,86,180 మంది కోలుకోగా ఇప్పటివరకు 4,47,751 మంది బాధితులు మరణించారు. ప్రస్తుతం దేశంలో 2,82,520 కేసులు యాక్టివ్‌గా ఉండగా ఇప్పటివరకు 87,66,63,490 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వైద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది.