యువతికి గర్భం చేసిన పిల్లాడు

194
kerala girl
- Advertisement -

కేరళలోని ఎర్నాకుళం జిల్లా కొచ్చి నగరంలో 18 ఏళ్ల అమ్మాయి తల్లి అయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. కొచ్చి శివారు మున్సిపాలిటీ కలమసెరికి చెందిన ఆ అమ్మాయిని తల్లిని చేశాడన్న ఆరోపణలపై 12 ఏళ్ల బాలుడితోపాటు ప్రసవం చేసిన ఆసుపత్రిపైనా పోలీసులు కేసు నమోదుచేశారు. వివరాల్లోకి వెళితే. పురుటినొప్పులతో బాధపడుతూ ఓ అమ్మాయి కలమసెరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వచ్చింది. చూడటానికి మైనర్ లా ఉన్న ఆ అమ్మాయికి ఆపరేషన్ చేయాలా వద్దా అనే మీమాంసలో వైద్యులు.. పిల్లల సంరక్షణా(చైల్డ్ లైన్) కేంద్రానికి ఫోన్ చేశారు. దీంతో చైల్డ్ లైన్ ప్రతినిధులు ఆసుపత్రికి వచ్చి వివరాలు చెప్పడంతో ఆపరేషన్ చేసి పాపాయిని బయటికి తీశారు. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉండటంతో నవంబర్ 4న వారిని డిశ్చార్జి చేశారు. చైల్డ్ లైన్ ప్రతినిధులు, ఆసుపత్రి వర్గాల కథనం ప్రకారం 12 ఏళ్ల బాలుడి కారణంగా అమ్మాయి గర్భం దాల్చింది.

kerala girl

ఈ విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. బాలనేరస్తుల చట్టాన్ని అనుసరించి 12 ఏళ్ల నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంత సున్నితమైన కేసు గురించి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, రహస్యంగా ఆపరేషన్ నిర్వహించినందుకుగానూ సదరు ఆసుపత్రిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు. అయితే పిల్లల సంరక్షణా కేంద్రం, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులు మాత్రం పోలీసుల తీరును తప్పుబడుతున్నారు. అమ్మాయి రెండు నెలల కిందటే మేజర్ అయినందున ప్రసవం గురించిన సమాచారం పోలీసులకు చెప్పాల్సిన అవసరం లేదని వాదిస్తున్నారు. మరికొందరు మాత్రం అసలు 12 ఏళ్ల బాలుడు ఆ పని ఎలా చెయ్యగలడా? అని వాపోతున్నారు. దర్యాప్తులో నిజానిజాలు వెలికితీస్తామని, ప్రస్తుతానికి తల్లీబిడ్డల్ని ప్రభుత్వ సంరక్షణా కేంద్రానికి తరలించామని కలమసెరి సీఐ జయకృష్ణన్ సోమవారం మీడియాకు చెప్పారు.

- Advertisement -