ఇద్దరు విలన్లు మృతి..

193
- Advertisement -

కర్నాటకలో ఓ సినిమా షూటింగ్‌లో దుర్ఘటన చోటు చేసుకుంది. మాస్తిగుడి సినిమా క్లైమాక్స్‌ షూటింగ్ చేస్తుండగా ఇద్దరు విలన్లు మృతి చెందారు. దునియా సినిమా ఫేం విజయ్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటోంది. హెలికాప్టర్ నుంచి చెరువులోకి హీరో విజయ్ తో పాటు ఇద్దరు విలన్లు ఉదయ్, అనీల్ దూకారు. అయితే హీరో విజయ్ బయటకు వచ్చేశారు. విలన్లు ఉదయ్, అనీల్ ఇద్దరు జలసమాధి అయ్యారు. బెంగళూరు నగర శివార్లలోని తిప్పగుండన హళ్ళి చెరువులో ఈ విషాదం చోటుచేసుకుంది.

motion-poster-duniya-vijays-maasthi-gudi-has-been-revealed-occasion-duniya-vijays-birthday

1990లో చోటుచేసుకున్న సంఘటన ఆధారంగా మాస్తిగుడి సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో విజయ్‌ 25 ఏళ్ల నుంచి 75 ఏళ్ల వయస్సు పాత్రల్లో కనిపిస్తాడు. పులుల సంరక్షణకు పాటుపడే వ్యక్తి పాత్రను పోషించనున్నట్లు తెలిసింది. ఈ సినిమాకు దర్శకుడు నాగశేఖర్‌.

 

- Advertisement -