హెపటైటిస్ A..ఈజాగ్రత్తలు తప్పనిసరి!

15
- Advertisement -

కేరళను హెపటైటిస్ వ్యాధి ఆందోళనకు గురి చేస్తోంది. మొదటి నాలుగున్నర నెలలలో 1977 కేసులు నమోదవ్వగా 12 మంది మృతి చెందారు. హెపటైటిస్-ఏ కేసులు పెరుగుతుండటంతో వాటిని ఎదుర్కొనేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని మంత్రి వీణా జార్జ్ అధికారులను ఆదేశించారు.

ముఖ్యంగా కేసులు ఎక్కువగా నమోదవుతున్న మలప్పురం, ఎర్నాకులం, కోజికోడ్, త్రిసూర్ జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో హెపటైటిస్ నివారణ, అవగాహన చర్యల్ని అంచనా వేసి కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.

తాగునీటిని క్లోరినేషన్ చేయాలని…హోటల్స్, రెస్టారెంట్లు కూడా కస్టమర్లకు వేడిచేసిన నీటినే సర్వ్ చేయాలని ఆదేశించింది ప్రభుత్వం.హెపటైటిస్ A వైరస్ కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. కలుషితమైన ఆహారం, నీటి ద్వారా లేదా అంటువ్యాధి ఉన్న వ్యక్తితో ప్రత్యక్ష సంబంధం ద్వారా ఇది వ్యాపిస్తుంది. హెచ్ఐవీ, కాలేయ వ్యాధితో ఉన్నవారు త్వరగా హెపటైటిస్ బారిన పడే ఛాన్సులున్నాయి. కాచి చల్లార్చిన నీరు తాగడం, బహిరంగ మలవిసర్జనకు దూరంగా ఉండటం, తినేముందు చేతులు శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

Also Read:బెండకాయ నీటితో ఉపయోగాలు

- Advertisement -