నేటి నుండి ఈ జిల్లాల్లో చిరు ఆక్సిజన్ బ్యాంకులు!

54
chiru

కరోనా బాధితులకు అండగా మెగాస్టార్ చిరంజీవి నిలిచిన సంగతి తెలిసిందే. కరోనా బాధితులకు ఆక్సిజన్ కొరత తీర్చేందుకు చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా ఆక్సిజ‌న్ బ్యాంకులు నెలకొల్పడానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంకులు ప్రారంభంకాగా తాజాగా నేటి నుండి ఈ జిల్లాల్లో అందుబాటులోకి రానున్నాయి ఆక్సిజన్ బ్యాంకులు.

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు, తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ అందుబాటులోకి వస్తాయని స్వయంగా వెల్లడించారు చిరు. ఈ మిషన్‌లో భాగమైన అందరికి, ప్రాణాలను కాపాడటానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని పేర్కొన్నారు.