దేశంలో కొత్త‌గా 1,59,632 క‌రోనా కేసులు..

60

దేశంలో క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్న కొత్త‌గా 1,59,632 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపిది. దేశంలో క‌రోనా నుంచి 40,863 మంది కోలుకున్నారు. అలాగే, నిన్న 327 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్ర‌స్తుతం 5,90,611 మంది క‌రోనాకు ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 3,44,53,603 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. డైలీ పాజిటివిటీ రేటు 10.21 శాతంగా ఉంది. మొత్తం మృతుల సంఖ్య‌ 4,83,790గా ఉంది. మొత్తం 151.58 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వేశారు.