మహేష్‌ సోదరుడు రమేష్ బాబు మృతి..

20

సూపర్ స్టార్ కృష్ణ పెద్దకుమారుడు, మహేష్‌ బాబు సోదరుడు.. ఒకనాటి హీరో రమేష్ బాబు (56) శనివారం కన్నుమూశారు. ఈ వార్త ఘట్టమనేని అభిమానుల్ని షాక్ కు గురిచేస్తోంది. రమేష్ బాబు కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. నిన్న సాయంత్రం తీవ్ర అస్వస్థతకు లోనవడంతో రమేశ్ బాబును హుటాహుటీన ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. రమేష్‌ బాబు మృతితో టాలీవుడ్ లో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన మరణంతో పలువురు దిగ్భ్రాంతికి గురయ్యారు.