దేశంలో 24 గంటల్లో 1,52,734 కరోనా కేసులు..

69
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గ‌త 24 గంట‌ల్లో 1,52,734 కేసులు న‌మోదుకాగా 3128 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,80,47,534కు చేరగా ప్రస్తుతం దేశంలో 20,26,092 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

ఇప్పటివరకు కరోనాతో 3,29,100 మంది మ‌హ‌మ్మారితో మృతిచెందగా రిక‌వ‌రీ రేటు 91.60 శాతానికి పెర‌గ‌గా, పాజిటివిటీ రేటు 9.04 శాతానికి త‌గ్గింది. ఇప్ప‌టివ‌ర‌కు 21,31,54,129 మందికి క‌రోనా టీకా పంపిణీ చేయగా 34,48,66,883 న‌మూనాల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు చేశామ‌ని ఐసీఎంఆర్ తెలిపింది.