విజయవాడలో 100 దాటిన పెట్రోల్ ధరలు..

73
petrol

మళ్లీ పెట్రోల్ ధరలు భగ్గుమన్నాయి. రోజువారి సమీక్షలో భాగంగా లీట‌ర్‌ పెట్రోల్‌పై మ‌రో 29 పైస‌లు, డీజిల్‌పై 24 పైస‌ల చొప్పున వ‌డ్డించి సామాన్యుడి నడ్డి విరిచాయి చమురు కంపెనీలు. దేశ రాజ‌ధానిలో పెట్రోల్, డీజిల్‌ ధ‌రలు రికార్డు స్థాయికి చేరాయి. ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ రూ.94.23, డీజిల్ రూ.85.15గా ఉండగా ముంబైలో పెట్రోల్ రూ.100.47, డీజిల్ రూ.92.45గా ఉన్నాయి.

భోపాల్‌లో పెట్రోల్ రూ.102.34, డీజిల్ రూ.93.37కు, కోల్‌క‌తాలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు రూ.94.25, రూ.87.74కు చేరాయి. విజయవాడలో 100.21కి చేరగా హైద‌రాబాద్‌లో పెట్రోల్ ధ‌ర రూ.97.93, డీజిల్ రూ.92.83గా ఉంది.