సౌత్ కొరియాలో తొక్కిసలాట..

320
souel
- Advertisement -

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిన్న రాత్రి ప్రమాదం జరుగగా మృతుల సంఖ్య 149కి చేరగా గాయపడిన వారి సంఖ్య 150కి చేరింది.

ప్రతి ఏడాది నిర్వహించే హాలోవీన్‌ వేడుకల్లో భాగంగా ఇటావోన్ లో నిన్న ఓ ఇరుకైన వీధిలోకి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. దీంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొని తొక్కిసలాట చోటుచేసుకుంది. మృతి చెందిన వారిలో ఇద్దరు విదేశీయులని అధికారులు చెప్పారు.

దక్షిణ కొరియాలో ఇటీవలే కరోనా ఆంక్షలు సడలించారు. దీంతో పెద్ద ఎత్తున జనాలు హాలోవీన్‌ వేడుకల్లో పాల్గొన్నారు.

- Advertisement -