- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 14,623 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 197 మంది మృతిచెందారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,41,08,996కు చేరగా 3,34,78,247 మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,78,098 యాక్టివ్ కేసులుండగా 4,52,651 మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశవ్యాప్తంగా రికవరీ రేటు 98.15 శాతంగా ఉండగా యాక్టివ్ కేసుల సంఖ్య 0.52 శాతానికి పడిపోయింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 99,12,82,283 డోసుల వ్యాక్సిన్ పూర్తి అయింది.
- Advertisement -