యాదాద్రి స్వర్ణ తాపడం…ఏపీ నుండి భారీ విరాళం

149
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని పునర్నిర్మాణానికి చేపట్టి, పూర్తిచేయడం ఒక గొప్ప యజ్ఞం అని కొనియాడారు వైఎస్ఆర్ కడప జిల్లా వ్యాపారవేత్త, చిన్న మండెం జెడ్పీటీసీ మోడెం జయమ్మ. అతి త్వరలో ఆ దేవాలయాన్ని పునః ప్రారంభించబోతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని ప్రకటించారు.

పునర్నిర్మాణంలో భాగంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి గర్భగుడిని బంగారు తాపడంతో చేపడుతున్నామని ముఖ్యమంత్రి అన్నారు. ఇందుకోసం 125 కిలోల బంగారం అవసరమని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించారు. కేసీఆర్ గారి ప్రకటన మేరకు నేను, నా కుటుంబ సభ్యులందరం కలిపి ఒక కేజీ బంగారాన్ని దేవాలయానికి విరాళంగా ప్రకటిస్తున్నామని చెప్పారు మోడెం జయమ్మ గారు. ఇందుకు సంబంధించిన చెక్కును గౌరవ సీఎం కేసీఆర్ గారిని మరోసారి యాదాద్రి పర్యటన సందర్భంగా కలిసి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో అందజేస్తామన్నారు.

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి అంటే నాకు ఎంతో నమ్మకం, ఇష్టమని చెప్పారు. ఈ మహత్తర కార్యక్రమంలో నేను, నా కుటుంబ సభ్యులు భాగస్వామ్యం అవుతున్నందున శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి, గౌరవ సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని ప్రకటించారు వైఎస్ఆర్ కడప జిల్లా వ్యాపారవేత్త, చిన్న మండెం జెడ్పీటీసీ మోడెం జయమ్మ.

- Advertisement -