దేశంలో 24 గంటల్లో 1,41,986 కరోనా కేసులు..

56
covid

దేశంలో కరోనా విజృంభిస్తోఓంది. గత 24 గంటల్లో రోజుకు 1,41,986 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 285 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,53,68,312కి చేరగా ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,72,169కి చేరాయి. కరోనాతో ఇప్పటివరకు 4,83,178 మంది మృతిచెందారు.

దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 98.36 శాతంగా ఉండగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 150.06 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇక దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3,071కి చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 876, ఢిల్లీలో 513, కర్ణాటకలో 333, రాజస్థాన్‌లో 291, కేరళలో 284, గుజరాత్‌లో 204, తెలంగాణలో 123 కేసులు నమోదయ్యాయి.