శ్రీవారిని దర్శించుకున్న కరణం మల్లీశ్వరి

224
ttd
- Advertisement -

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు..ఇవాళ ఉదయం వి.ఐ.పి‌విరామ సమయంలో భారతీయ క్రీడాకారిణి కరణం మల్లీశ్వరి,ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావులు వేర్వేరు స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు..అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా..ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి‌ తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన భారతీయ క్రీడాకారిణి కరణం మల్లీశ్వరి మీడియాతో మాట్లాడుతూ..గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ కారణంగా క్రీడా పోటీలకు అంతరాయం కలిగింది.. తిరుపతి‌లో కబడ్డీ పోటీలు నిర్వహించడం చాలా ఆనందదాయకం మన్నారు.. వెయ్యికి పైగా క్రీడాకారులు ఈ పోటీలకు హాజరు అయినట్లు ఆమె తెలిపారు.. క్రీడలను ప్రోత్సహించే విధంగా తిరుపతిలో నిర్వహిస్తున్నారని, కోవిడ్ లాంటి విపత్కర పరిస్ధితుల్లో క్రీడా పోటీల్లు నిర్వహిస్తే ప్రజల్లో నూతన ఉత్సహంను నింపేందుకు వీలవుతుందన్నారు..ఈ క్రీడా పోటీలకు తిరుపతి ప్రజలు కూడా సహకరించడం సంతోషంగా ఉందని భారతీయ క్రీడాకారిణి కరణం మల్లీశ్వరి అన్నారు.

- Advertisement -